జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని ఐపీఎల్ కోసం పీఎస్‌ఎల్‌ను వీడటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహంగా ఉన్నట్లు కథనాలు చెబుతున్నాయి. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అతడు, ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడేందుకు మొగ్గుచూపాడు. దీంతో ఒప్పంద ఉల్లంఘన జరిగిందని భావిస్తున్న పీసీబీ చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. టీ20 వరల్డ్‌కప్‌లో మెరిసిన ముజరబాని నిర్ణయం ఇప్పుడు పీఎస్‌ఎల్-ఐపీఎల్ పోటీని మరోసారి హాట్ టాపిక్‌గా మార్చింది.
ఐపీఎల్ కోసం పీఎస్‌ఎల్‌కు షాక్.. ముజరబానిపై పీసీబీ ఆగ్రహం
7
Published on: 📅 14 Mar 2026, 12:16 PM
Reported by: 🖊
Anitha Sharma