ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులను చూపిస్తూ దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అస్సాంలోని సిల్చార్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ కీలక సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పార్టీ విఫలమైందన్నారు. భారత అభివృద్ధిని అడ్డుకునే శక్తుల చేతుల్లో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెబుతారని మోదీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు.. దేశంలో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపణ
6
Published on: 📅 14 Mar 2026, 02:50 PM
Reported by: 🖊
Anitha Sharma