వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత దేశవ్యాప్తంగా హోటళ్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో చిన్న హోటళ్లు మూతపడగా, మరికొన్ని ధరలు పెంచి వ్యాపారం కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలోని ఓ హోటల్ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇడ్లీ, వడ ధరలతో పాటు ప్రత్యేకంగా గ్యాస్ ఛార్జ్ చేర్చడం అందరి దృష్టిని ఆకర్షించింది. గ్యాస్ కొరత వల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని, వినియోగదారులు సహకరించాలని హోటల్ నిర్వాహకులు బోర్డులు పెట్టి వివరణ ఇస్తున్నారు.
ఇడ్లీ, వడ బిల్లులో గ్యాస్ ఛార్జ్.. నెట్టింట హోటల్ రసీదు వైరల్
3
Published on: 📅 13 Mar 2026, 10:28 AM
Reported by: 🖊
Suresh Reddy