దర్శకుడు ఆదిత్య ధర్ ప్రస్తుతం ‘ధురంధర్ 2’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలిపారు. పుట్టినరోజు రోజున కూడా ఈ చిత్రానికి తుదిమెరుగులు దిద్దే పనిలోనే ఉన్నానని సోషల్ మీడియాలో వెల్లడించారు. మొదటి భాగాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన ప్రయాణంలో ఎప్పుడూ తోడుగా నిలిచిన టీమ్‌కు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులు పంపుతున్న మెసేజ్‌లు, పోస్ట్‌లు, మీమ్స్ చూసి ఎంతో ఆనందంగా ఉందని, అందరి ప్రేమ తనకు పెద్ద ప్రేరణగా మారిందని చెప్పారు.
‘ధురంధర్ 2’ పనుల్లో బిజీ.. పుట్టినరోజున దర్శకుడు ఆదిత్య ధర్ భావోద్వేగం
7
Published on: 📅 13 Mar 2026, 10:18 AM
Reported by: 🖊
Suresh Reddy