కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో మహా పాదయాత్ర ప్రారంభించారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించడంతో మొక్కు తీర్చుకునేందుకు ఈ యాత్ర చేపట్టినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా గెలిచిన ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ఆయన వెంట నడిచారు. దాదాపు 10 వేల మంది కార్యకర్తలు పాల్గొంటుండగా, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలం మరోసారి ప్రదర్శనకు వచ్చినట్టైంది.
అంజన్న ఆశీర్వాద యాత్రకు బండి శ్రీకారం.. 10 వేల మందితో కొండగట్టు పాదయాత్ర
5
Published on: 📅 14 Mar 2026, 11:44 AM
Reported by: 🖊
Suresh Reddy