ys jagan ycp legislature meeting before ap budget session

బడ్జెట్ సత్రం ముందే వైసీపీ కీలక భేటీ.. రేపు జగన్ అధ్యక్షతన సమావేశం

Published on: 📅 12 Feb 2026, 06:20 AM
Reporter: 🖊

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభలో ప్రభుత్వం తీసుకురానున్న అంశాలపై స్పందన, ప్రతిపక్షంగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇవాళ సభకు హాజరైన వైసీపీ సభ్యులు కొంతసేపటికే వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.

Sponsored