vizag steel plant support cm chandrababu

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్తి మద్దతు: సీఎం చంద్రబాబు

Published on: 📅 04 Feb 2026, 05:53 AM
Reporter: 🖊

విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్లాంట్ పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్త విధానాలతో అన్ని విభాగాల్లో సామర్థ్యం పెంచాలని సూచించారు. గతంలో ఎదురైన ఆర్థిక నష్టాల నుంచి ప్లాంట్ క్రమంగా కోలుకుంటోందని అధికారులు వివరించారు. 2024 సెప్టెంబర్‌లో రూ.486 కోట్ల నష్టం ఎదుర్కొన్న ప్లాంట్, 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని నమోదు చేసినట్లు సమీక్షలో వెల్లడైంది

Sponsored