ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను అమెరికా కోరినట్లు US మీడియా సంస్థ Axios వెల్లడించింది. ఇరాన్ ఆయిల్, ఎనర్జీ సదుపాయాలపై మరిన్ని దాడులు జరిగితే అక్కడి ప్రజలకు నష్టం కలగవచ్చని, అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. అలాగే గల్ఫ్ దేశాల ఎనర్జీ సదుపాయాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశం కూడా ఉందని పేర్కొంది. యుద్ధం ముగిసిన తర్వాత ఆయిల్ రంగంలో ఇరాన్ సహకారం అవసరమని అమెరికా భావిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలి: US
10
Published on: 📅 11 Mar 2026, 12:22 PM
Reported by: 🖊
Suresh Reddy