మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్రవాహనం ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. మృతులను హవేలీఘనపూర్ మండలం బొడుగ భూపతిపూర్ గ్రామానికి చెందిన అమృత్ గౌడ్ (40), ఆయన కుమారుడు రిషి వర్ధన్ గౌడ్ (12), బావమరిది సాయి గౌడ్ (35)గా గుర్తించారు. రంగంపేటలో జరిగిన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్‌లో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్, ముగ్గురు మృతి
6
Published on: 📅 14 Mar 2026, 06:11 PM
Reported by: 🖊
Suresh Reddy