the rising asphalt makes the journey miserable

లేచిన తారు.. ప్రయాణం బేజారు!

Published on: 📅 10 Nov 2025, 12:29 PM
Reporter: 🖊

హైదరాబాద్-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై పలు చోట్ల తారు లేచిపోవడంతో ప్రయాణం కష్టంగా మారింది. రోడ్డు అంతటా గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై టోల్‌ వసూలు చేస్తున్నప్పటికీ, నిర్వహణపై అధికారులు శ్రద్ధ చూపడం లేదని వాహనదారులు వాపోతున్నారు. నల్లగొండ జిల్లా ఏపీ లింగోటం వద్ద తారు పూర్తిగా తొలగిపోయి రహదారి గుంతలమయంగా మారింది.

Sponsored