పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు రూ.2.34 కోట్లకు కొనుగోలు చేయడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ నిర్ణయంపై అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలంలో సన్‌రైజర్స్ సీఈవో కావ్యా మారన్, కోచ్ డానియల్ వెట్టోరి పాల్గొన్నారు. ఇదే సమయంలో సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ ఖాతా సస్పెన్షన్‌కు గురవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఖాతా ఎక్స్ నియమాలను ఉల్లంఘించినందుకే సస్పెండ్ చేసినట్లు పాప్ అప్ సందేశం కనిపిస్తోంది. కారణాలపై ఇంకా అధికారిక వివరణ వెలువడలేదు.
పాక్ స్పిన్నర్ కొనుగోలు తర్వాత వివాదం.. సన్‌రైజర్స్ లీడ్స్ ఖాతా సస్పెండ్
4
Published on: 📅 13 Mar 2026, 10:54 AM
Reported by: 🖊
Anitha Sharma