ఐపీఎల్ మినీ వేలంలో రూ.18 కోట్లకు కొనుగోలు అయిన శ్రీలంక పేసర్ మతీష పతిరణ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నెల 28 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా ఆయన ఇంకా జట్టులో చేరలేదని సమాచారం. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ బోర్డు సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎడమ కాలి కండరాల నొప్పితో టీ20 వరల్డ్ కప్ మధ్యలోనే వైదొలిగారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 32 మ్యాచ్‌ల్లో 47 వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.
గాయంతో ఇంకా కోలుకోని పతిరణ
6
Published on: 📅 11 Mar 2026, 12:38 PM
Reported by: 🖊
Ramesh Kumar