ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 18న లక్ష మందికి టిడ్కో ఇళ్లు అందజేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. జూన్ నాటికి మిగతా టిడ్కో ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే 2028 నాటికి పట్టణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక TDR బాండ్ల జారీ విషయంలో గత ప్రభుత్వం వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు.