రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం 14వేల టన్నుల గ్యాస్ నిల్వలు ఉన్నాయని, మరికొన్ని టన్నులు త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, ఆలయాలకు గ్యాస్ కొరత రాకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. సిలిండర్ల డైవర్షన్‌ను అడ్డుకునేందుకు ఈ కేవైసీ, ఓటీపీ విధానాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని వెల్లడించారు.
రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు.. సీఎం చంద్రబాబు సమీక్ష
10
Published on: 📅 18 Mar 2026, 09:25 AM
Reported by: 🖊
Anitha Sharma