స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లోకి మోటరోలా మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. భారత్‌లో కొత్తగా విడుదలైన మోటో వాచ్ ధర స్టెయిన్‌లెస్ స్టీల్ వర్షన్‌కు రూ.5,999 కాగా, లెదర్ స్ట్రాప్ వర్షన్ రూ.6,999గా ఉంది. ఈ వాచ్ 47mm కేస్ సైజ్‌తో, మ్యాట్ బ్లాక్ మరియు మ్యాట్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. శాండ్‌బ్లాస్ట్ అల్యూమినియం ఫ్రేమ్‌తో ప్రీమియం డిజైన్‌ను అందిస్తోంది. గతంలో విడుదలైన మోటో 360 తర్వాత మోటరోలా స్మార్ట్‌వాచ్ విభాగంలో మళ్లీ తన స్థానాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేస్తోంది.