maharashtra solapur evms found car election commission clarification

మహారాష్ట్రలో కారులో లభించిన ఈవీఎంలపై వివరణ ఇచ్చిన ఎన్నికల సంఘం

Published on: 📅 09 Feb 2026, 06:21 AM
Reporter: 🖊

మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో ఓ హోటల్ సమీపంలో కారులో రెండు ఈవీఎంలు లభ్యమవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం ఈ ఘటన జరగడంతో పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ, అవి పోలింగ్‌కు ఉపయోగించని ‘రిజర్వ్ ఈవీఎంలు’ అని స్పష్టం చేసింది. అన్ని ఓటింగ్ యంత్రాలు సమయానికి స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరచినట్లు తెలిపింది. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రకటించింది.

Sponsored