ఎన్టీఆర్ జిల్లా దేవుని చెరువు పాఠశాలలో నాణ్యతలేని మధ్యాహ్న భోజనం అందించిన ఘటనపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపారు. వెంటనే త్రిసభ్య కమిటీతో విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. నివేదిక ఆధారంగా ఆహారం సరఫరా చేస్తున్న ఏజెన్సీని మార్చి, ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షణ కట్టుదిట్టం చేస్తామని, LEAP యాప్ ద్వారా తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్ తీసుకునే వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
నాణ్యతలేని మధ్యాహ్న భోజనంపై లోకేశ్ ఆగ్రహం.. హెడ్‌మాస్టర్ సస్పెండ్
2
Published on: 📅 13 Mar 2026, 03:13 PM
Reported by: 🖊
Anitha Sharma