krishna board for ap godavari board for telangana committee on banakacharla sensational decisions in the meeting of the chief ministers of telugu states

ఏపీకి కృష్ణాబోర్డు..తెలంగాణకు గోదావరి బోర్డు....బనకచర్లపై కమిటీ....తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో సంచలన నిర్ణయాలు

Published on: 📅 17 Jul 2025, 08:59 AM
Reporter: 🖊

ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ సారధ్యంలో జరిగిన ఈ భేటీ గంటన్నర పాటు జరిగింది. భేటీ ప్రారంభంలో సీఆర్‌ పాటిల్‌తో పాటు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు పరస్పరం గౌరవంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు తెలంగాణ ప్రతిపాదించిన 13 అంశాలపై ఈ భేటీలో చర్చించారు. కృష్ణా, గోదావరి జలాలు, బనకచర్లపై సాంకేతిక నిపుణులు, అధికారులతో కమిటీ ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Sponsored