అమెరికాకు ఇరాన్ షాక్ ఇచ్చింది. గల్ఫ్ ప్రాంతంలో క్షిపణి రక్షణ వ్యవస్థలకు కీలకమైన రాడార్ సిస్టమ్‌ను దెబ్బతీసినట్లు సమాచారం. థాడ్ (THAAD) మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలో ఉపయోగించే రాడార్ పరికరాలను ధ్వంసం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి వైమానిక స్థావరంలో ఉన్న ఈ రాడార్‌పై యుద్ధం ప్రారంభంలోనే దాడి జరిగినట్లు ధృవీకరించారు. ఈ సిస్టమ్ విలువ సుమారు 300 మిలియన్ డాలర్లు (దాదాపు ₹2,760 కోట్లు)గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు మొత్తం 8 థాడ్ వ్యవస్థలు ఉన్నట్లు సమాచారం.
అమెరికా రాడార్ వ్యవస్థపై ఇరాన్ దాడి
2
Published on: 📅 07 Mar 2026, 06:32 PM
Reported by: 🖊
Kiran Rao