దేశంలో వంటగ్యాస్ కొరతపై ఆందోళనలు పెరుగుతుండగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. భారత్‌కు రావాల్సిన ఎల్పీజీ ట్యాంకర్లు ప్రస్తుతం హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయినట్లు సమాచారం. మొత్తం ఎనిమిది ట్యాంకర్లు అక్కడే ఆగిపోవడంతో వాటిని సురక్షితంగా దాటించేందుకు భారత్ ఇరాన్‌తో చర్చలు జరుపుతోంది. ఈ విషయంపై ఇరాన్ అధికారులు సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ట్యాంకర్లు ప్రయాణం కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
వంటగ్యాస్ కొరతపై కేంద్రం చర్యలు.. హర్మూజ్ వద్ద నిలిచిన ట్యాంకర్లపై ఇరాన్‌తో చర్చలు
5
Published on: 📅 13 Mar 2026, 12:55 PM
Reported by: 🖊
Anitha Sharma