in ap a new railway route a new railway station is ready there one can travel quickly from hyderabad to tirupati

ఏపీలో కొత్త రైలు మార్గం.. అక్కడ కొత్త రైల్వే స్టేషన్ రెడీ.. హైదరాబాద్ టు తిరుపతి త్వరగా వెళ్లొచ్చు

Published on: 📅 30 Jul 2025, 09:56 AM
Reporter: 🖊

ఆంధ్రప్రదేశ్‌లో నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో కనిగిరి వరకు ట్రాక్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దర్శి రైల్వే స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ స్టేషన్ మీదుగా రైలు పరుగులు తీయనుంది. ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుండి తిరుపతి, చెన్నై వెళ్లడం సులువు అవుతుంది. పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది.

Sponsored