జగన్‌పై

జగన్‌పై చంద్రబాబు విమర్శలు

Published on: 📅 06 Mar 2026, 04:02 PM
Reporter: 🖊 Anitha Sharma

పరామర్శల పేరుతో జగన్ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు విమర్శించారు. గంజాయి బ్యాచ్ పరామర్శలకు వెళ్లడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వైసీపీ డ్రామాల వల్ల అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయని అన్నారు. వారి వాహనాల టైర్లు ప్రజలను తొక్కేస్తున్నాయని ఆరోపించారు. తరువాత ఆ నిందను ప్రభుత్వంపైనే మోపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోస్టుమార్టమ్‌కు కారణమైన వాళ్లే పోస్టుమార్టమ్‌కు వెళతారని సెటైర్ వేశారు.

Sponsored