వాణిజ్య గ్యాస్ కొరత కారణంగా ఐటీ కంపెనీల క్యాంటీన్ సేవలకు అంతరాయం కలుగుతోంది. దీంతో కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలని సూచించగా, మరికొన్ని వర్క్ ఫ్రం హోమ్‌కు అనుమతి ఇస్తున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ చెన్నై కార్యాలయంలో ఉద్యోగులకు తాత్కాలికంగా ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించింది. ఇన్ఫోసిస్ కూడా బెంగళూరు, చెన్నై కార్యాలయాల్లో క్యాంటీన్ సేవలు పరిమితం చేసి సూచనలు జారీ చేసింది.గ్యాస్ కొరత పరిస్థితి కొనసాగితే ఐటీ కార్యాలయాల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశముందని సంస్థలు చెబుతున్నాయి.
గ్యాస్ కొరత ప్రభావం.. ఐటీ కంపెనీల్లో వర్క్ ఫ్రం హోమ్ సూచనలు
6
Published on: 📅 13 Mar 2026, 09:25 AM
Reported by: 🖊
Ramesh Kumar