congress favourable in municipal polls cm revanth reddy

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే అనుకూలత: సీఎం రేవంత్ రెడ్డి

Published on: 📅 06 Feb 2026, 06:39 PM
Reporter: 🖊

మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఆయన కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. మళ్లీ మళ్లీ పోటీ చేసే అవకాశం అందరికీ రాదని, పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు తప్పకుండా గెలవాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడతాయని పేర్కొంటూ, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అభ్యర్థులకు సూచించారు.

Sponsored