గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు మంత్రులకు ఆదేశించారు. పలువురు మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం అంతా చేయాలని స్పష్టం చేశారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. హోటళ్లు, ఇతర భాగస్వామ్య వర్గాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి సరిపోయే ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు.
గ్యాస్‌పై గందరగోళం వద్దు.. సీఎం అలర్ట్
5
Published on: 📅 14 Mar 2026, 11:19 AM
Reported by: 🖊
Anitha Sharma