నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్ వసూలు నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పూర్తిగా అందుబాటులోకి రాని ఎక్స్‌ప్రెస్‌వేలపై ఇకపై మొత్తం టోల్ వసూలు చేయరని ప్రకటించింది. పనులు పూర్తయిన మేరకే టోల్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో కొంత భాగం మాత్రమే ప్రారంభమైన ఎక్స్‌ప్రెస్‌వేలను ఉపయోగించే ప్రయాణికులకు టోల్ భారం తగ్గనుంది. ప్రస్తుతం నేషనల్ హైవేలతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్‌వేలపై 25 శాతం అధికంగా టోల్ వసూలు చేస్తున్నారు.
ఎక్స్‌ప్రెస్‌వే టోల్ రూల్స్‌లో కేంద్రం కీలక మార్పులు
Published on: 📅 15 Feb 2026, 10:14 AM
Reporter: 🖊
>
>
>