bill gates meets cm chandrababu naidu amaravati visit

అమరావతిలో బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఘన స్వాగతం

Published on: 📅 16 Feb 2026, 11:56 AM
Reporter: 🖊

అమరావతి పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద గేట్స్‌కు పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. అనంతరం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌తో బిల్ గేట్స్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రాజెక్టులను విస్తరించడం, కొత్త భాగస్వామ్య అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

Sponsored