balochistan clashes 216 bla rebels killed

బలూచిస్థాన్ ఘర్షణలు: 216 మంది BLA రెబల్స్ హతం

Published on: 📅 06 Feb 2026, 11:16 AM
Reporter: 🖊

బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇటీవల జరిగిన ఘర్షణల్లో 216 మంది BLA రెబల్స్‌ను హతమార్చినట్లు పాకిస్థాన్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో కీలక నేతలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. అయితే ఎదురుదాడుల్లో 36 మంది పౌరులు, 22 మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. కోల్, గోల్డ్, కాపర్, గ్యాస్ వంటి ఖనిజ సంపదలతో సమృద్ధిగా ఉన్న బలూచిస్థాన్ స్వాతంత్య్రం కోసం కొన్నేళ్లుగా తిరుగుబాట్లు కొనసాగుతున్నాయి.

Sponsored