గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు 0863-2340678, వాట్సాప్ 91 85000 27678 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి AP నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRT) సాయం చేస్తోందని మంత్రి వివరించారు
గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Published on: 📅 02 Mar 2026, 03:44 PM
Reporter: 🖊 Kiran Rao