59 polytechnic colleges job guarantee centers police set apply last date april 22

59 పాలిటెక్నిక్ కాలేజీలు జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా.. పాలిసెట్ దరఖాస్తులకు ఏప్రిల్ 22 వరకు గడువు

Published on: 📅 23 Feb 2026, 03:19 PM
Reporter: 🖊

రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్ కాలేజీలను జాబ్ గ్యారంటీ కేంద్రాలుగా తీర్చిదిద్దామని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే లక్ష్యంతో విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలని పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా పాలిటెక్నిక్ సిబ్బంది ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, KGBVలు, గురుకులాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, మే 13న పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Sponsored